పచ్చకామెర్లతో యువకుడి మృతి
ABN , Publish Date - Feb 14 , 2026 | 12:15 AM
గత ఆరేళ్ల కిందట భర్త.. ఇప్పుడు కొడు కు ఒకే జబ్బుతో మృతిచెందారు.
గంట్యాడ, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): గత ఆరేళ్ల కిందట భర్త.. ఇప్పుడు కొడు కు ఒకే జబ్బుతో మృతిచెందారు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. వివరా లిలా ఉన్నాయి. కొండతామరాపల్లి గ్రామానికి చెందిన కోన ఆదిలక్ష్మి, ఎర్నినా యుడు దంపతులకు ఇద్దరు కుమారులు. గత ఆరేళ్ల కిందట ఎర్నినాయుడు పచ్చకామెర్లతో మృతిచెందారు. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఆదిలక్ష్మి కుటుంబ బాధ్యతలు తీసుకుంది. కుటుంబ బాధ్యతలు కష్టం కావడంతో పెద్దకుమారుడు పవన్ కుమారు(22) చదువును పక్కన పెట్టి.. ఆటో డ్రైవింగ్ చేస్తూ కుటుంబా నికి ఆధారంగా నిలిచాడు. తన తమ్ముడు వంశీని చదివిస్తున్నాడు. ఈతరుణం లో పవన్ కుమార్‌కు గత పది రోజులు కిందట పచ్చకామెర్ల వచ్చింది. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డున పడింది.