డివైడర్ ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:53 PM
పట్టణంలోని లావేరు రోడ్డులో డివైడర్‌ను ఢీకొని రెడ్డి వంశీ(25) అనే యువకుడు మృతిచెందాడు.
చీపురుపల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని లావేరు రోడ్డులో డివైడర్‌ను ఢీకొని రెడ్డి వంశీ(25) అనే యువకుడు మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డిపేటకు చెందిన వంశీ ఆదివారం మధ్యాహ్నం మెట్టపల్లిలోని తమ తాత వారింటికి వెళ్లి వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వంశీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమో దు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.