గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:04 AM
మండలంలోని చోడమ్మఅగ్రహారం పంచాయతీ పరిధిలో గల జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల నందిగాం గ్రామానికి చెందిన గజరావు నగేష్(30) అనే వ్యక్తి మృతిచెందాడు.
పూసపాటిరేగ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మండలంలోని చోడమ్మఅగ్రహారం పంచాయతీ పరిధిలో గల జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల నందిగాం గ్రామానికి చెందిన గజరావు నగేష్(30) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నగేష్ ఆదివారం ఉదయం విజయవాడ నుంచి తన వ్యానుపై బయలుదేరాడు. సోమవారం ఉదయం చోడమ్మఅగ్రహారం మేట్రిక్స్ పరిశ్రమ సమీపంలోకి వచ్చేసరికి, వ్యానును రోడ్డు పక్కన నిలిపాడు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి, తిరిగి నడుచుకుంటూ వస్తుండగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య భవానీ అందజేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.