Share News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:20 AM

మండలంలోని కందివలస సంత సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో విశాఖ జిల్లా కొమ్మాది గ్రామానికి చెందిన కోన రమ(44) అనే మహిళ మృతిచెందింది.

 రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

పూసపాటిరేగ, మే 31(ఆంధ్రజ్యోతి): మండలంలోని కందివలస సంత సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ప్రమాదంలో విశాఖ జిల్లా కొమ్మాది గ్రామానికి చెందిన కోన రమ(44) అనే మహిళ మృతిచెందింది. కొమ్మాది గ్రామంలో ఉంటూ ఒక ప్రైవేటు పరిశ్రమలో పనిచేస్తున్న ఈమె.. ఆదివారం ఉదయం శ్రీకాకుళంలోని తన చెల్లి ఇంటికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండ గా ఈ ప్రమాదం సంభవించింది. తలకు బలమైన గాయాలు కావటంతో అక్కడిక్కడే మృతిచెందింది. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే విషయం తెలియరాలే దు. స్థానిక ఎస్‌ఐ వి.అరుణకిరణ్‌ ఘటనా స్థలాన్ని చేరుకుని కేసును నమోదు చేశారు. ఈమె భర్త కోటేశ్వరరావు గతంలోనే మృతిచెందగా, ఆమె తన ఇద్దరి పిల్లలతో తన తండ్రి వద్ద కొమ్మాదిలోనే నివాసం ఉంటోంది.

Updated Date - Jun 01 , 2026 | 12:20 AM