Share News

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:11 AM

భోగాపురంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీప చీమలవలస గ్రామానికి చెందిన బొడ్డేపల్లి వెంకటలక్ష్మి(45) అనే మహిళ మృతిచెందింది.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

భోగాపురం, ఫిబ్రవరి2(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస సమీప చీమలవలస గ్రామానికి చెందిన బొడ్డేపల్లి వెంకటలక్ష్మి(45) అనే మహిళ మృతిచెందింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటలక్ష్మి తన కుటుంబంతో పాటు శ్రీకాకుళం వైపు నుంచి విశాఖ వెళ్లే సర్వీస్‌ రోడ్డులోని ఐవోబీ సమీపంలో నివాసం ఉంటోంది. ఆదివారం రా త్రి ఆమె ఇంటి పని నిమిత్తం సర్వీస్‌రోడ్డు సమీపానికి రావడం తో అదే రోడ్డులో వెళ్తున్న కారు బలంగా ఢీకొని, కొంతదూరం ఈడ్చుకుపో యింది. దీంతో ఆమె తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందింది. మృతు రాలి భర్త ప్రైవేటు కళాశాలలో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమా ర్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వివాహం నిశ్చయ మైంది. వెంకటలక్ష్మి మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్వంతమయ్యారు. మృతురాలి భర్త రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భోగాపురం ఎస్‌ఐ సూర్యకుమారి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 03 , 2026 | 12:11 AM