లారీ ఢీకొని మహిళ మృతి
ABN , Publish Date - Jan 18 , 2026 | 11:51 PM
రావివలస గ్రామానికి చెందిన గుంట్రె డ్డి అప్పమ్మ(68) ఆదివారం లారీ ఢీకొని మృతి చెందింది.
గరుగుబిల్లి, జనవరి18 (ఆంధ్రజ్యోతి): రావివలస గ్రామానికి చెందిన గుంట్రె డ్డి అప్పమ్మ(68) ఆదివారం లారీ ఢీకొని మృతి చెందింది. గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్ అందించిన వివరాల ప్రకారం.. రావివలసకు చెందిన అప్పమ్మ ఉద యం పాల ప్యాకెట్ కోసం దుకాణానికి వెళుతున్న సమయంలో అరటికాయలను లోడింగ్ చేసేందుకు వచ్చిన లారీ ఆమెను వెనుక నుంచి ఢీకొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వ తీపురం కేంద్రాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం లారీ డ్రైవర్ పెనుగొండ శ్రీనివాస్ నిర్లక్ష్యం వల్లే జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.