Share News

‘Sir’ Procedure పక్కాగా ‘సర్‌’ పక్రియ

ABN , Publish Date - May 30 , 2026 | 11:19 PM

A Well-Defined ‘Sir’ Procedure ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్‌)ను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జూన్‌ 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో బీఎల్‌వోలకు కిట్లను అందించారు.

  ‘Sir’ Procedure పక్కాగా ‘సర్‌’ పక్రియ
బీఎల్‌వోలకు కిట్లు అందజేస్తున్న కలెక్టర్‌

పార్వతీపురం/పార్వతీపురం టౌన్‌, మే30(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్‌)ను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. జూన్‌ 15 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో బీఎల్‌వోలకు కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చేనెల 15 నుంచి జూలై 14 వరకు నిర్వహించనున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌వోలు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. తప్పులకు తావులేకుండా సమర్థంగా ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లాలో బీఎల్‌వోలందరికీ రెవెన్యూ అధికారులు కిట్లు అందిస్తారని తెలిపారు. అనంతరం ఆయన వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించారు. ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా పని చేయలని కలెక్టర్‌ సూచించారు. జిల్లాలో అమలు అవుతున్న వివిధ జాతీయ కార్యక్రమాలు, వాటి ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రానున్న ఐదు రోజుల పాటు జిల్లాలో 41 డిగ్రీలకు మించి ఉష్ణో గ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటకు వెళ్లరాదన్నారు.

గడువులోగా పనులు పూర్తి చేయాలి

జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని సంబంధింత అఽధికారు లను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన మాట్లా డుతూ.. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడరాదన్నారు. వేగవంతంగా పనుల పూర్తికి చర్యలు తీసుకోవాలని సూచించారు. వన్‌ స్టాప్‌ సెంటర్‌ భవనాలను జూన్‌ 30లోగా అప్పగించాలన్నారు.

Updated Date - May 30 , 2026 | 11:19 PM