ఎస్.కోట మండలంలో దొంగతనాల కలకలం
ABN , Publish Date - May 29 , 2026 | 12:26 AM
ఎస్.కోట మండలంలో దొంగతనా లు కలకలం రేగింది.
ఎస్.కోట రూరల్, మే 28(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట మండలంలో దొంగతనా లు కలకలం రేగింది. ముషిడిపల్లిలోని వనుమ గంగాలమ్మ ఆలయంలో గురు వారం రూ.25వేలు విలువ గల కుందులు, గంటలు చోరీకి గురయ్యాయి. ఆల య నిర్వాహాకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు.
మూడు తులాల బంగారు హారం చోరీ
మండలంలోని పోతనాపల్లి, గైరంపేట గ్రామాల మధ్య డాబా ప్రాంతంలో నివసిస్తున్న చలమూరి కుమారి అనే ఒంటరి మహిళ ఇంట్లో గురువారం మూ డు తులాల బంగారు హారం చోరీకి గురయ్యింది. ఆమె పోతనాపల్లిలో మహా నాడు కార్యక్రమానికి వెళ్లి వచ్చేసరికి, ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయి. ఇం ట్లోకి వెళ్లి బీరువా చూడగా అందులో మూడు తులాల హారం కనిపించలేదు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్‌టీం ఆధ్వర్యంలో వేలిముద్రలు సేకరించారు.
ఆసుపత్రిలో పుస్తెలతాడు..
మండలంలోని సంతగైరమ్మపేట గ్రామానికి చెందిన మహిళ పద్మ ఈనెల 22న పురిటి నొప్పులతో ఎస్.కోట సీహెచ్‌సీలో చేరింది. శస్త్రచికిత్స సమయంలో తన మెడలో ఉన్న పుస్తెలతాడును తీసి సంచిలో పెట్టింది. అయితే ఈనెల 25న సర్జరీ జరిగిన తర్వాత బ్యాగ్‌లో ఉన్న పుస్తెలతాడు పోయినట్లు గుర్తించిం ది. ఆమె బుధవారం ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో అనుమానిత వ్యక్తి తిరుగుతున్నట్టు గుర్తించారు.