Share News

A war blow to the egg గుడ్డుకు యుద్ధం దెబ్బ

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:31 AM

A war blow to the egg కోడి గుడ్డు ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం దెబ్బకు భారత్‌ నుంచి కోడి గుడ్ల ఎగుమతికి బ్రేక్‌ పడటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గుడ్ల నిల్వ పెరిగిపోతోంది. దీంతో రేటు సగానికి పైగా తగ్గింది. జిల్లాలోనూ కోడిగుడ్డు ధర రూ.3 నుంచి రూ.4 వరకూ విక్రయిస్తున్నారు. గ్రామాలకు వాహనాల్లో తెచ్చి విక్రయిస్తుండడం గమనార్హం.

A war blow to the egg గుడ్డుకు యుద్ధం దెబ్బ

గుడ్డుకు యుద్ధం దెబ్బ

సగానికి పడిపోయిన ధరలు

ఎగుమతులు ఆగిపోవడమే కారణం

ఆందోళన చెందుతున్న పౌలీ్ట్ర రైతులు

విజయనగరం/ కలెక్టరేట్‌/రాజాం, మార్చి 7(ఆంధ్రజ్యోతి):

కోడి గుడ్డు ధరలు అమాంతం పడిపోతున్నాయి. ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధం దెబ్బకు భారత్‌ నుంచి కోడి గుడ్ల ఎగుమతికి బ్రేక్‌ పడటంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో గుడ్ల నిల్వ పెరిగిపోతోంది. దీంతో రేటు సగానికి పైగా తగ్గింది. జిల్లాలోనూ కోడిగుడ్డు ధర రూ.3 నుంచి రూ.4 వరకూ విక్రయిస్తున్నారు. గ్రామాలకు వాహనాల్లో తెచ్చి విక్రయిస్తుండడం గమనార్హం.

యుద్ధం కారణంగా గగనతల, సముద్ర మార్గాలపై ఆంక్షలు పెరిగాయి. ఆ ప్రభావంతో ఏపీలో కూడా గుడ్ల ధరలు పడిపోయాయి. తాజా పరిణామాలపై పౌలీ్ట్ర రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో కోడిగుడ్ల ధరలు రెండు, మూడు రోజులుగా పడిపోతూ వస్తున్నాయి. 100 గుడ్ల హోల్‌సేల్‌ ధర రూ.420గా పలుకుతోంది. కొన్నిచోట్ల గుడ్డు రూ.3 నుంచి రూ.4 వరకూ విక్రయిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫౌలీ్ట్రలలో రోజుకు దాదాపు 5 కోట్ల వరకూ గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. విజయనగరం రైతు బజారులో రోజుకు 2500 గుడ్లు విక్రయిస్తున్నారు. అయితే ఈ మొత్తం ఉత్పత్తిలో రాష్ట్రంలో సగం మాత్రమే వినియోగిస్తున్నారు. మిగిలిన కోడి గుడ్లను దేశంలోని ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఎగుమతి తగ్గడంతో ధరలు తగ్గిపోయాయి. చెన్నైయి పోర్టు నుంచి గల్ఫ్‌ దేశాలకు కోడిగుడ్లు ఎగుమతులు నిలిచిపోయాయని చెబుతున్నారు.

- గతేడాది డిసెంబరు 20న గుడ్ల ధరలు దారుణంగా పెరిగాయి. అప్పట్లో రూ.8 వరకూ అమ్ముడుపోయింది. 100 కోడి గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.678కు చేరిన సంగతి తెలిసిందే. అయితే ధర నెమ్మదిగా తగ్గుతోంది. ప్రస్తుతం నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌ఈసీఈ) ధర రూ. 4.20కి పడిపోయిందని గణంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో పలు చోట్ల గుడ్డు ధర రూ.3.30కి కూడా పడిపోయినట్లు తెలుస్తోంది. కోడి గుడ్లు ధరలు పడిపోవడంతో ఫౌలీ్ట్రల రైతులు ఆందోళనలో చెందుతున్నారు.

- జిల్లాలో గుడ్లు పెట్టే కోళ్లఫారాలు అధికం. రాజాం, ఎస్‌.కోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో అధికంగా ఫారాలు ఉన్నాయి. 100 గుడ్ల ధరను నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ రూ.420గా నిర్ధారించింది. ఈ లెక్కన రూ.4.20కి అమ్మాలి కానీ చాలా ప్రాంతాల్లో గుడ్డు రూ.3కు విక్రయిస్తున్నారు.

ఆటోల్లో విక్రయాలు

కొత్తవలస, మార్చి 7(ఆంధ్రజ్యోతి): కోళ్లఫారాలలో ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోవడంతో కొందరు వ్యాపారులు ఆటోల్లో తిరుగుతూ విక్రయిస్తున్నారు. ధర ఇంకా పడిపోతే నష్టం వస్తుందన్న భయంతో ఇప్పుడున్న ధరకు అమ్మకాలు చేస్తున్నారు. కోళ్ల ఫారాలు రెండు రకాలు. బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు, కోడిగుడ్లు ఉత్పత్తి చేసే ఫారాలు ఉంటాయి. కొత్తవలస పౌల్ర్టీ జోన్‌లో బ్రాయిలర్‌ కోళ్ల ఫారాలు ఎక్కువ. గుడ్లను ఉత్పత్తి చేసే కోళ్ల ఫారాలు తక్కువ. యుద్ధ వాతావరణం కారణంగా ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యే కోడిగుడ్లు నిలిచిపోడంతో ఫారాలలో ఉత్పత్తి అవుతున్న కోడిగుడ్లు ధరలు తగ్గిపోతూ వస్తున్నాయి. 30 కోడిగుడ్లు కలిగిన అట్ట ధర గతంలో 850 రూపాయల వరకు ధరపలికితే అదే అట్ట ధర ప్రస్తుతం 450 రూపాయలకు పడిపోయింది. మరి కొద్దిరోజులు యుద్ధం కొనసాగితే ఈ ధరలు మరింత పడిపోయే ప్రమాదం ఉందని భావించి ఆటో ద్వారా గుడ్లను విక్రయించుకుంటున్నానని రామలింగపురం గ్రామానికి ఊట అప్పారావు తెలిపారు. ఊరూరా ఆటోలో గుడ్లు అమ్ముతూ శనివారం కనిపించారు.

------------------------

Updated Date - Mar 08 , 2026 | 12:31 AM