Share News

Chakratheertha నేత్రపర్వం.. చక్రతీర్థ స్నానం

ABN , Publish Date - Feb 15 , 2026 | 12:24 AM

A Visual Spectacle: Chakratheertha Holy Dip శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భామినిలో శనివారం ఉమాలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు.

  Chakratheertha  నేత్రపర్వం.. చక్రతీర్థ స్నానం
వంశధార నదిలో ఉత్సవమూర్తులకు చక్రతీర్థ స్థానం చేయిస్తున్న దృశ్యం

భామిని, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భామినిలో శనివారం ఉమాలింగేశ్వరస్వామి చక్రతీర్థ స్నానాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో వేంచేయించి భక్తజనం నడుమ గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పెద్ద ప్రజలు పాల్గొనడంతో అంతటా శివనామస్మరణ మార్మోగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య ఉత్సవమూర్తులను నదీతీరానికి చేర్చి చక్రతీర్థ స్నానం చేయించారు. ఈ క్రమంలో భక్తులు కూడా నదిలో స్నానాలు ఆచరించి పులకించిపోయారు. యువత రంగులు పూసుకుని.. హోలీ ఆడుతూ, నృత్యాలతో సందడి చేశారు. అనంతరం ఆలయంలో శివపార్వతుల కల్యాణం, అన్న సమారాధన నిర్వహించారు.

Updated Date - Feb 15 , 2026 | 12:24 AM