‘ఉయ్యాలవాడ’కు నివాళి
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:52 PM
బ్రిటీష్ నిరంకుశ పాలనపై గర్జించిన తొలితరం స్వాతం త్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని జేసీ సేతు మాధవన్ కొనియాడారు.
విజయనగరం కలెక్టరేట్, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): బ్రిటీష్ నిరంకుశ పాలనపై గర్జించిన తొలితరం స్వాతం త్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని జేసీ సేతు మాధవన్ కొనియాడారు. యువజన సర్వీసు లు శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఉయ్యాలవాడ వర్ధంతి కార్యక్ర మంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చిత్ర ప టానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈసంద ర్భంగా జేసీ మాట్లాడుతూ ఉయ్యాలవాడ పోరాటం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో చిర స్థాయిగా నిలిచి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విజ్ సీఈవో విశ్వేశ్వరరావు, మేనేజర్ కేవీ రమణ, కలెక్టరేట్ ఏవో ప్రసాద్ ఉన్నారు.
విజయనగరం క్రైం, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా 1846 లోనే ప్రజలను సంఘటితం చేసి, పోరాటం ప్రారంభిం చిన మహనీయుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అని ఆర్‌ఐ గోపాలనాయుడు అన్నారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నర్సింహారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.