Polamamba పోలమాంబపై నమ్మకానికి నిదర్శనం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:27 AM
A Testament to Faith in Polamamba ఈ చిత్రంలో కనిపిస్తున్నది శంబర పోలమాంబ వనంగుడి వద్ద ఉన్న వేపచెట్టు. అమ్మపై నమ్మకంతో భక్తులు ఇలా చెట్టుకు ముడుపులు కట్టారు. ఇలా కట్టడం వల్ల కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం. అందుకే జాతరకు వచ్చే వారంతా అమ్మవారిని దర్శించుకుని వేపచెట్టుకు ముడుపులు కడుతున్నారు.
కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం
మక్కువ రూరల్, ఫిబ్రవరి23(ఆంధ్రజ్యోతి): ఈ చిత్రంలో కనిపిస్తున్నది శంబర పోలమాంబ వనంగుడి వద్ద ఉన్న వేపచెట్టు. అమ్మపై నమ్మకంతో భక్తులు ఇలా చెట్టుకు ముడుపులు కట్టారు. ఇలా కట్టడం వల్ల కోరికలు నెరవేరుతాయని వారి విశ్వాసం. అందుకే జాతరకు వచ్చే వారంతా అమ్మవారిని దర్శించుకుని వేపచెట్టుకు ముడుపులు కడుతున్నారు. మరికొందరు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సంతానం కలగాలని, ఉద్యోగం రావాలని, పంటలు బాగాపండాలని, ఆరోగ్యం బాగుండాలని.. ఎంతోమంది ముడుపులు కడుతుండగా... ఎర్రటి మూటలతో దర్శనమిస్తున్న ఈ వేపచెట్టు మాత్రం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
5వ వారం జాతరకు ఏర్పాట్లు పూర్తి
శంబర పోలమాంబ 5వ వారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో బి.శ్రీనివాస్ తెలిపారు. సోమవారం ఆయన విలేఖర్లతో మాట్లడుతూ.. మంగళవారం భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో చదురుగుడి, వనంగుడి వద్ద ప్రత్యేకంగా క్యూలైన్లు సిద్ధం చేశామన్నారు. క్యూలైన్లలో ఉన్న వారికి తాగునీటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాం. లడ్డూ ప్రసాదం కూడా సిద్ధం చేశారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని మక్కువ ఎస్‌ఐ ఎం.వెంకటరమణ తెలిపారు. బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నట్లు సాలూరు డిపో మేనేజరు పి.ఆచారి ఒక ప్రకటనలో తెలిపారు.