A test for a baby.. a lifelong amulet శిశువుకు పరీక్ష.. జీవితాంతం రక్ష
ABN , Publish Date - May 10 , 2026 | 12:27 AM
A test for a baby.. a lifelong amulet నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అయితే పాపాయి పుట్టినప్పుడు చూడడానికి ఎంతో ముద్దుగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ లోలోపల కొన్ని అనారోగ్య సమస్యలు దాగి ఉండొచ్చు. ఈ లోపాలను తొలి దశలోనే పసికట్టకపోతే, భవిష:్యత్తులో ఆ బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలోనే నవజాత శిశు పరీక్షలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
శిశువుకు పరీక్ష.. జీవితాంతం రక్ష
నవజాత శిశువులకు స్ర్కీనింగ్ ఓ కవచం
వైకల్య నివారణకు ఏకైక మార్గం
సూచిస్తున్న వైద్యులు
విజయనగరం రింగురోడ్డు, మే 9(ఆంధ్రజ్యోతి):
నవమాసాలు మోసి కనిపెంచిన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి తల్లి, తండ్రి కోరుకుంటారు. అయితే పాపాయి పుట్టినప్పుడు చూడడానికి ఎంతో ముద్దుగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ లోలోపల కొన్ని అనారోగ్య సమస్యలు దాగి ఉండొచ్చు. ఈ లోపాలను తొలి దశలోనే పసికట్టకపోతే, భవిష:్యత్తులో ఆ బిడ్డ ఎదుగుదలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఈ నేపథ్యంలోనే నవజాత శిశు పరీక్షలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చాలా మంది తల్లిదండ్రులు బిడ్డ పాలు తాగుతున్నాడని, ఏడుస్తున్నాడని అంతా సవ్యంగా ఉందని భావిస్తారు. కాని రక్తహీనత, థైరాయిడ్, వినికిడి లోపాలు, గుండె సమస్యలు వంటివి బయటకు వెంటనే తెలియవు. బిడ్డ ఎదుగుతున్న కొద్దీ మాటలు రాకపోవడం, నడకలో ఇబ్బందులు, మానసిక వికాసం మందగించడం వంటివి జరుగుతాయి. అప్పుడు చికిత్స ప్రారంభించినా ఫలితం తక్కువగా ఉంటుంది. ఈ ఆలోచనతోనే పుట్టిన వెంటనే పరీక్ష- జీవితాంతం రక్ష అనేది వైద్యుల నినాదంగా మారింది. న్యూబోర్న్ స్ర్కీనింగ్ ప్రధానంగా మూడు పద్ధతుల్లో జరుగుతుంది.
ఏఏ పరీక్షలు ఎలా చేస్తారు?
- రక్త పరీక్ష : శిశువు పుట్టిన 24 గంటల నుంచి 48 గంటల తరువాత. మడమ భాగం నుంచి చిన్నసూదితో రెండు చుక్కల రక్తాన్ని సేకరిస్తారు. దీని ద్వారా సుమారు 30 నుంచి 50 రకాల జబ్బులను గుర్తించవచ్చు.
- వినికిడి సామర్థ్యం: శిశువు నిద్రపోతున్నప్పుడు చెవిలో చిన్న ఈయర్ ఫోన్ వంటి పరికరాన్ని వుంచి పరీక్ష చేస్తారు. బిడ్డకు శబ్దాలు విన్పిస్తున్నాయో? లేదో దీని ద్వారా తెలుస్తుంది.
- క్రిటికల్ కంజెనిటల్ హార్ట్ డీ సీజ్ : శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను కొలిచే పల్స్ ఆక్సిమీటరు ద్వారా గుండెలోపాలను అంచనా వేస్తారు.
నివారించదగ్గ ప్రధాన సమస్యలు ఇవే
హైపో థారాయిడిజమ్: దీనివల్ల శిశువు మెథడు ఎదుగుదల ఆగిపోయి బుద్ధిమాంధ్యం వచ్చే ప్రమాదం వుంది. సకాలంలో గుర్తిస్తే ఒక మాత్రతో దీనిని నయం చేయవచ్చు.
- వినికిడి లోపం పుట్టినప్పుడే గుర్తిస్తే ఆరు నెలలలోపు చికిత్స అందించి ఆ బిడ్డకు మాటలు వచ్చేలా చేయవచ్చు.
ఘోషాసుపత్రిలో న్యూబోర్న్ స్ర్కీనింగ్ పరీక్షలు
డాక్టరు జె.దీపక్‌కుమార్, హెచ్‌ఓడీ పీడీయాట్రిక్ విభాగం, ఘోషాసుపత్రి
న్యూ బోర్న్ స్ర్కీనింగ్ అనేది ఖర్చుతో కూడుకున్న పనికాదు. అది బిడ్డ భవిష్యత్తుపై చేసే పెట్టుబడి. పుట్టిన వెంటనే చేసిన ఈ పరీక్షలు బిడ్డకు వైకల్యం రాకుండా అడ్డుకుంటాయి. ప్రతి ప్రసవ ఆసుపత్రిలోనూ ఈ పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి అని గుర్తించాలి. ఘోషాసుపత్రిలో నవజాత శిశువులకు న్యూ బోర్న్ స్ర్కీనింగ్ పరీక్షలు చేస్తున్నాం.