సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Jun 03 , 2026 | 11:25 PM
ఎల్.కోట మండలంలోని ఆర్జీపేట వద్ద 133/33 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేసి చుట్టుపక్కల ప్రజలు ఎదు ర్కొంటున్న లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే లలిత కుమారి కోరారు.
లక్కవరపుకోట/కొత్తవలస, జూన్ 3(ఆంధ్రజ్యోతి): ఎల్.కోట మండలంలోని ఆర్జీపేట వద్ద 133/33 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుచేసి చుట్టుపక్కల ప్రజలు ఎదు ర్కొంటున్న లోవోల్టేజీ సమస్యను పరిష్కరించాలని శృంగవరపుకోట ఎమ్మెల్యే లలిత కుమారి కోరారు. బుధవారం ఎస్.కోట నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కోసం విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, క్రీడలు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్‌రెడ్డికి వినతులు అందజేశారు. కొత్తవలసలో ఎన్టీఆర్ క్రీడా వికాశ కేంద్రం పనులు పూర్తిచేయాలని, అరకు పర్యాటక ప్రాంతం కావడంతో విశాఖ నుంచి నియోజకవర్గం మీదుగా బస్సులు సంఖ్య పెంచి పర్యాటక అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కేబీఏ రాంప్రసాద్, రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా రామకృష్ణ, దుర్గాఉమేష్, సాగర్ కళ్యాణ్ పాల్గొన్నారు.