Chakra Teertha Snanam నేత్రపర్వం.. చక్రతీర్థ స్నానం
ABN , Publish Date - Oct 25 , 2026 | 12:08 AM
A Spectacle to Behold… Chakra Teertha Snanam ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు శనివారం కనులపండువగా చక్రతీర్థ స్నానం నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాత సేవ, బాల భోగం, చూర్ణోత్సవం, స్నపనము, తదితర పూజలు చేశారు. స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో వేంచేయించి.. నాగావళి నది వరకు తిరువీధి నిర్వహించారు.
గరుగుబిల్లి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఉత్సవమూర్తులకు శనివారం కనులపండువగా చక్రతీర్థ స్నానం నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాత సేవ, బాల భోగం, చూర్ణోత్సవం, స్నపనము, తదితర పూజలు చేశారు. స్వామివార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో వేంచేయించి.. నాగావళి నది వరకు తిరువీధి నిర్వహించారు. అనంతరం ప్రధాన అర్చకుడు అప్పలాచార్యుల ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాలకు చక్రతీర్థ స్నానాలు ఘనంగా నిర్వహించారు. దీంతో నదీతీర ప్రాంతమంతా గోవింద నామస్మరణతో మార్మోగింది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సిబ్బంది తగు చర్యలు చేపట్టారు. కాగా ఉభయ దేవస్థానాల పరిధిలో ఈ నెల 21 నుంచి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఈవో వీవీ సూర్యనారాయణ, సిబ్బంది జి.శ్రీధర్‌నాయుడు, స్వామి వారి సేవకులు పాల్గొన్నారు.