ప్రత్యేక మండలం ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:24 AM
22
గుమ్మలక్ష్మీపురం, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కురుపాం మండలంలోని నీలకంఠాపురంప్రధానకేంద్రంగా ప్రత్యేక గిరిజన మండలాన్ని ఏర్పాటు చేయా లని మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజుతోపాటు పలు గిరిజన సంఘాల నాయకులు కోరారు. ఈమేరకు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణికి సోమవారం ఆమె చాం బర్‌లో వినతిపత్రాన్ని అందించారు. జీవో-3 సుప్రీంకోర్టులో రద్దు కావడంతో ఆదివాసీల మనుగడకు నష్టం కలగకుండా ఉండాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నీకలంఠేశ్వరరావు, నలకంఠాపురం సర్పంచ్ మన్మఽథరావు, బి.రామారావు, కడాయి పాల్గొన్నారు.