Share News

Without Poverty పేదరికం లేని సమాజమే లక్ష్యం

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:09 AM

A Society Without Poverty is the Goal పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని, పీ-4తో బంగారు కుటుంబాలు తలరాతలు మారుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పీ-4 ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

 Without Poverty  పేదరికం లేని సమాజమే లక్ష్యం
కార్య క్రమంలో మాట్లాడుతున్న జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు

  • జిల్లా ఇన్‌చార్జి మంత్రి అచ్చెన్నాయుడు

పార్వతీపురం, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని, పీ-4తో బంగారు కుటుంబాలు తలరాతలు మారుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పీ-4 ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ‘ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పీ-4 కార్యక్రమంతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో బంగారు కుటుంబాలుగా 78,464 వరకు రిజిస్ర్టేషన్లు అయ్యాయి. అందులో 11,519 కుటుంబాలను 2,998 మంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారు. విద్య, వైద్యం ఉపాధి వంటి రంగాల్లో సహాయం కోరిన వారిని బంగారు కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించింది. 1995లో ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలా పీ-4కు కూడా విశేష స్పందన లభిస్తోంది’ అని తెలిపారు.

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ... బంగారు కుటుంబం పేరుతో ప్రభుత్వం రూపొం దించిన వెబ్‌సైట్‌లో ఎవరికి ఏ సహాయం అవసరమో స్పష్టంగా పొందుపరిచారని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి తగు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

- 177 బంగారు కుటుంబాలకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ బి.అప్పలనాయుడు, కురుపాంలో ఎంతోమంది విద్యార్థులకు పరీక్ష కిట్లు అందించిన టీడీపీ నేత వీరేష్‌ చంద్రదేవ్‌కు మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందించారు. మార్గదర్శకులు టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షురాలు ఎం.తేజోవతి, బిఎన్‌బీ రావు, ఎ.రమణమ్మ, తిరుపతిరావు, సీహెచ్‌. శ్రీనివాసరావు తదితరులకు ప్రశంసాపత్రాలు అందించారు. ఇదే సమయంలో హనుమంతు శంకరరావు అనే వ్యక్తి పార్వతీపురం ఎమ్మెల్యే దత్తత తీసుకోవడంతో తమ కుటుంబ పరిస్థితి ఎలా మారిందో వివరించారు. అనంతరం చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌ రెడ్డి, సబ్‌ కలెక్టర్‌ వైశాాలి, డీఆర్వో హేమలత, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:10 AM