Share News

పరామర్శ ముసుగులో బలప్రదర్శన

ABN , Publish Date - Aug 01 , 2026 | 12:35 AM

జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరా జును ములాఖత్‌ ముసుగులో పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ సాలూరు నియోజకవర్గం పరిశీలకుడు దినేష్‌ రెడ్డి ప్రశ్నించారు.

పరామర్శ ముసుగులో బలప్రదర్శన

  • రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్‌ చైర్మన్‌ దినేష్‌ రెడ్డి

మెంటాడ, జూలై 31(ఆంధ్రజ్యోతి): గొర్రెల కాపరిని బైక్‌తో ఢీకొట్టి, అతని మృతికి కారణమైన పుత్రరత్నాన్ని కాపాడేం దుకు సాక్ష్యాలు చెరిపేసింది చాలక, ఈ నేరంలో ఓ అమాయక యువకుడ్ని ఇరికిం చాలని చూసి, ప్రస్తుతం జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరా జును ములాఖత్‌ ముసుగులో పరామర్శించేందుకు వెళ్లిన జగన్‌ సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకున్నారని రాష్ట్ర పర్యావరణ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ సాలూరు నియోజకవర్గం పరిశీలకుడు దినేష్‌ రెడ్డి ప్రశ్నించారు. ఆయన శుక్రవా రం స్థానిక విలేకర్లతో మాట్లాడారు. సీదిరిని పరామర్శ పేరుతో జగన్‌ ప్రారంభం నుంచి బల ప్రదర్శన చేశారని ఆయన విమర్శించారు. పలాస మహిళా ఎస్‌ఐపై వైసీపీ మూకలు అనుచితంగా ప్రవర్తించడం ఆ పార్టీ అరాచకానికి రుజువని, దీని పై చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఉద య భాస్కర్‌, టీడీపీ మండల అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు, గెద్ద అన్నవ రం, రాయిపల్లి రవిశంకర్‌, రాజగోపాల్‌, ఎర్నాయుడు, గోవింద్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2026 | 12:35 AM