రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పాలి
ABN , Publish Date - Jul 08 , 2026 | 11:54 PM
నియో జకవర్గంలో రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పా లని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు కోరారు.
చీపురుపల్లి, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నియో జకవర్గంలో రెసిడెన్షియల్ పాఠశాలను నెలకొల్పా లని చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంకట రావు కోరారు. బుధవారం చీపురుపల్లి నియోజ కవర్గంలోని పలు సమస్యల పరిష్కరించాలని బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమం త్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఎంను కలిసిన కళా పలు సమ స్యలను వివరించారు. గరివిడి మండలంలోని బొండపల్లిలో ఇటీవల విధినిర్వహణలో మరణిం చిన వీఈడబ్ల్యు లోచర్ల సాయిబాబు కుటుం బాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, చీపురుపల్లి శ్రీకనకమహాలక్ష్మి ఆలయ అభివృద్ధి కోసం సీజీఎఫ్ నుంచి నిధులు విడుదల చేయా లని కోరారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ ద్వారా చివరి ఎకరానికి కూడా సాగు నీరందించేలా అధికారులను ఆదేశించాలని విన్నవించారు.