కాశీబుగ్గలో జిల్లావాసి ఆత్మహత్య
ABN , Publish Date - May 18 , 2026 | 11:54 PM
కుటుంబ కలహాల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది.
పలాస, మే 18(ఆంధ్రజ్యోతి): కుటుంబ కలహాల వల్ల ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. కాశీబుగ్గ పోలీసుల కథనం మేరకు... విజయనగరం జిల్లా కొత్తకొప్పర్ల గ్రామానికి చెందిన పైడిరాజు సీతమ్మతల్లి చేపల మార్కెట్ వద్ద ఉన్న వైష్ణవి సప్లయర్స్, క్యాటరింగ్స్‌లో వారం రోజుల కిందట పనిలో చేరాడు. తరువాత ఇంటికి తిరిగి వెళ్లి ఈనెల 16న మళ్లీ అదేపనిలోకి వచ్చాడు. ఈక్రమంలో షాపు పైన ఉన్న రూములోకి వెళ్లి తిరిగి రాలేదు. ఆదివారం షాపు సిబ్బంది వెళ్లి చూడగా కిటికీ గజాలకు ఉరిపోసుకొని ఉన్నట్లు గుర్తించారు. మృత దేహానికి సోమవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.