Share News

రాజాం వాసి చీపురుపల్లిలో మృతి

ABN , Publish Date - Jun 02 , 2026 | 11:40 PM

రాజాంలోని మల్లికార్జున కాలనీకి చెందిన అలజంగి రమేష్‌(42) అనే వ్యక్తి చీపురుపల్లిలో మృతిచెందారు.

 రాజాం వాసి చీపురుపల్లిలో మృతి

చీపురుపల్లి, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): రాజాంలోని మల్లికార్జున కాలనీకి చెందిన అలజంగి రమేష్‌(42) అనే వ్యక్తి చీపురుపల్లిలో మృతిచెందారు. ఆర్టీసీ బస్‌ కాం ప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న దుకాణ సముదాయం వద్ద రమేష్‌ మృతదేహాన్ని స్థానికు లు మంగళవారం గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేశారు. జి.సిగడాం మండల పరిషత్‌ కార్యాలయంలో అటెండరుగా పనిచేస్తున్న రమేష్‌.. గత కొద్ది రోజులుగా పట్టణంలో సంచరిస్తున్నట్టు తెలిసింది. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతుని కుటుంబీలకు సమాచారం అందజేశారు. అయితే ఈ మృతి కి కారణాలు తెలియరాలేదు.

Updated Date - Jun 02 , 2026 | 11:40 PM