Share News

రైతులకు పింఛన్‌ ఇవ్వాలి

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:17 AM

పేద, మధ్యతరగతి రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇవ్వాలని రైతు సంఘ నాయకులు డిమాండ్‌చేశారు.

రైతులకు పింఛన్‌ ఇవ్వాలి
నిరసన తెలుపుతున్న రైతులు :

విజయనగరం కలెక్టరేట్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి) పేద, మధ్యతరగతి రైతులు, కౌలురైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.10 వేలు పింఛన్‌ ఇవ్వాలని రైతు సంఘ నాయకులు డిమాండ్‌చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా రైతు సంఘ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సిద్ధమ వుతోందని, ఆ ఒప్పందం జరిగితే అమెరికా నుంచి పన్నులు లేకుండా వచ్చే చౌక దిగుమతుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని చెప్పారు. ఇప్పటికే ఆ ప్రభావంతో పొగాకు మొక్కజొన్న, మామిడి పత్తి తదితర పంటల ధరలు పడిపోయాయని తెలిపారు. అగ్రిమెంట్లు అమల్లోకి వస్తే ఆహార వాణిజ్య పంటలు పండించే 11 కోట్ల మంది రైతులు, ఎనిమిది కోట్ల మంది పాడి రైతులకు నష్టం వస్తుందన్నారు. నాలుగు లేబర్‌ కోడ్లు ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలోని రైతు సంఘ నాయకులు డేగల అప్పలరాజు, ఆదినారాయణ, ముత్యాలు నాయుడు, కొండలరావు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:17 AM