పిల్లలకు చదువే ఆస్తి
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:39 AM
తల్లిదం డ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువేనని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు.
బొబ్బిలి రూరల్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): తల్లిదం డ్రులు పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువేనని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అన్నారు. బుధవారం పారాదిలో నిర్మించిన బాలుర వసతిగృభ భవనాన్ని ఎమ్మెల్యే బేబీనాయనతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాల ల్లో చేర్పించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజు ్ఞలైన ఉపాధ్యాయులతో బోధన జరుగుతోందన్నారు. ప్రతి విద్యార్థి బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. ఎవరూ చదువుకు దూరం కాకుండా చూ డాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పారాదిలో బాలుర వసతిగృహం వల్ల సుమారు 15 గ్రామాల్లో విద్యార్ధులకు ఉపయోగపడుతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ వసతిగృహాన్ని ప్రారంభించాలని కలెక్టర్‌ను కోరిన వెంటనే వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. పారాది బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగ తున్నాయన్నారు. అప్రోచ్ రోడ్డుకై నిధుల కోసం కలెక్టర్‌తో మాట్లాడటంతో ప్రత్యేకంగా నిధులు రిలీజ్ చేయిం చారన్నారు. జూన్ నెలాఖరి సరికి వంతెనను అందు బాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. కార్యక్ర మంలో ఆర్డీవో రామ్మోహనరావు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి జె.జ్యోతిశ్రీ, ఎంపీడీవో రవికుమార్ పాల్గొన్నారు.