రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:05 AM
పూసపాటిరేగ పరిధిలోని కందివల స జాతీయ రహదారి వంతెనపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లాడి శేఖర్(35) మృతి చెందగా, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి.
మరొకరికి గాయాలు
పూసపాటిరేగ/ రణస్థలం, ఫిబ్రవరి 23(ఆం ధ్రజ్యోతి): పూసపాటిరేగ పరిధిలోని కందివల స జాతీయ రహదారి వంతెనపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లాడి శేఖర్(35) మృతి చెందగా, రాజ్‌కుమార్‌కు గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం మెట్టక్కివలస గ్రామానికి చెందిన శేఖర్, రాజ్‌కుమార్‌లు శుభకార్యం నిమిత్తం కార్డులు పంచుకుని ఎస్.కోట నుంచి స్వగ్రా మం ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం వైపు వస్తుండగా.. బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో శేఖర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన రాజ్‌కుమార్‌ను శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. జేఆర్ పురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు.