రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:02 AM
అడ్డాపుశీల వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పార్వతీపురం రూరల్, జనవరి5 (ఆంధ్రజ్యోతి): అడ్డాపుశీల వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తోటపల్లి గ్రామానికి చెందిన రాయిపల్లి సతీష్ (29) స్కూటీపై బొబ్బిలి నుంచి వస్తుండగా అడ్డాపుశీల వద్ద ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తండ్రి సుదర్శనం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ రాజేశ్ తెలిపారు.