Share News

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:08 AM

మండలంలోని పురిటిపెంట గ్రామా నికి చెందిన లెంక రామునాయుడు(52) మనస్తాపంతో పురుగు మందు తాగి.. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు శనివారం తెలిపారు.

మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

గజపతినగరం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): మండలంలోని పురిటిపెంట గ్రామా నికి చెందిన లెంక రామునాయుడు(52) మనస్తాపంతో పురుగు మందు తాగి.. చికిత్స పొందుతూ మృతిచెందినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు శనివారం తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడి తల్లి ఇటీవల అనారోగ్యానికి గురైతే ఆమెను పట్టించుకోకుండా రామునాయుడు ప్రతిరోజూ మద్యం తాగి ఇంటికి రావడంతో భార్య సన్యాసమ్మ మందలించింది. దీంతో మన స్తాపానికి గురైన రామునాయుడు శుక్రవారం రాత్రి కల్లంలో ఉన్న పురుగు మం దును తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య సన్యా సమ్మ చేసిన ఫిర్యాదు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Oct 04 , 2026 | 12:08 AM