వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Feb 06 , 2026 | 12:17 AM
మూర్చ వ్యాధి తాళలేక బుధవారం రాత్రి పట్టణానికి చెందిన బొబ్బిలి పరమేశు (37) ఇంటిలో ఆత్మహత్యకు పాల్ప డ్డాడు.
సాలూరు, ఫిబ్రవరి5 (ఆంధ్రజ్యోతి): మూర్చ వ్యాధి తాళలేక బుధవారం రాత్రి పట్టణానికి చెందిన బొబ్బిలి పరమేశు (37) ఇంటిలో ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలో దండిగాం రోడ్డులో కోనేటిగట్టుపై బొబ్బిలి పరమేశు తన భార్య భవాని, పిల్లలతో కలిసి కొంతకాలంగా జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆయనకు మూర్ఛ వ్యాధి ఉంది. తరచూ ఇంబ్బంది పడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన పరమేశు బుధవా రం రాత్రి ఇంటిలో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరి వేసుకున్నాడు. విషయం గమనించిన కుమారుడు గణేశ్, తల్లి భవానీకి సమాచారం అందిం చాడు. దాంతో వారు పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పరమేశు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పట్టణ ఎస్‌ఐ అనీల్‌కుమార్ కేసు నమోదు చేశారు.