నడిచివెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొని..
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:10 AM
మండలంలోని తారాపురం సమీ పంలో నడిచివెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
రామభద్రపురం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): మండలంలోని తారాపురం సమీ పంలో నడిచివెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వెళ్తున్న వ్యక్తులు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు.. పాచిపెంటకి చెందిన వి.నాగ రాజు, కె.మోహన రావు, వి.వెంకన్నలు మంగళవారం రాత్రి ద్విచక్రవాహనంపై రామభద్రపురం వైపు చిన్నమ్మతల్లి పండగకు వస్తున్నారు. అదే సమయంలో సాలూరు మండలంలోని పురోహితునివలసకు చెందిన బత్తి శ్రీనివాస్‌ను రామ భద్రపురం వైపు నడిచివెళ్తుండగా తారాపురం సమీపంలో ఢీకొన్నారు. దీంతో బత్తి శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. బైక్‌పై ఉన్న ముగ్గురికి కూడా గాయాలు తగలడంతో నలుగురిని వెంటనే 108లో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.