Koneru వెంకటరాయుని కోనేరుకు మహర్దశ
ABN , Publish Date - Jul 21 , 2026 | 11:41 PM
A New Lease of Life for Venkatarayuni Koneru పాలకొండలోని వెంకటరాయుని కోనేరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దాని సుందరీకరణకు సుమారు రూ.2 కోట్ల సుడా నిధులను మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనేఅధికారులు పనులు చేపట్టనున్నారు.
పాలకొండ, జూలై21(ఆంధ్రజ్యోతి): పాలకొండలోని వెంకటరాయుని కోనేరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు దాని సుందరీకరణకు సుమారు రూ.2 కోట్ల సుడా నిధులను మంజూరు చేసింది. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనేఅధికారులు పనులు చేపట్టనున్నారు. కాగా 15 ఎకరాల్లో విస్తరించి ఉన్న వెంకటరాయుని కోనేరు మట్టి కట్టను స్టోన్ ఫినిషింగ్ చేసి గట్టును మరింత బలంగా తయారుచేయనున్నారు. వివిధ రకాల మొక్కలను నాటి పచ్చదనం పెంపొందించనున్నారు. ప్రధానంగా కోనేరు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు సుడా చైర్మన్ రవికుమార్ ప్రకటించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కోనేరు అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని నగర పంచాయతీ కమిషనర్ నూకరాజు తెలిపారు.
గత కొన్నేళ్లుగా వెంకటరాయుని కోనేరు అభివృద్ధికి దూరంగా ఉంది. పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాలతో అధ్వానంగా దర్శమిస్తోంది. వాస్తవంగా జాతాపు రాజులైన వెంకటరాయుడు ఈ కోనేరును తవ్వించారని చరిత్ర చెబుతుంది. అప్పట్లో తాగునీరుగా వినియోగించే వారు. అయితే కాలక్రమంలో కోనేరు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. గత వైసీపీ హయాంలో దాని అభివృద్ధికి సుమారు రూ.30 లక్షలను కేటాయించారు. అయితే రూ.20 లక్షలు మేర పనులు జరిగినట్టు రికార్డులు సృష్టించారు. దీనిపై ఇటీవల విజలెన్స్ విచారణ కూడా జరిగినట్టు తెలుస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం కోనేరు అభివృద్ధికి చర్యలు చేపడుతుం డడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సర్వే కూడా చేపట్టారు. అవసరమైన పనులకు టెండర్లు పిలిచారు. దీంతో త్వరలోనే సుడా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతాయని పట్టణవాసులు ఆకాంక్షిస్తున్నారు.