త్రుటిలో తప్పిన ప్రమాదం
ABN , Publish Date - Sep 12 , 2026 | 12:29 AM
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది.
గుమ్మలక్ష్మీపురం, సెప్టెం బరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో శుక్రవారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. పీలేవీడికి చెందిన పి.కిరణ్‌కుమార్ బైక్‌పై వెళ్తుండగా ఆకస్మికంగా వాహనం నుంచి మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు బైక్ నుంచి కిందకు దిగాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ప్రమాదానికి గురైన బైక్ పెట్రోల్‌తో నడిచేదని బాధితుడు తెలిపారు.