Share News

గెడ్డలోకి దూసుకుపోయిన ద్విచక్రవాహనం

ABN , Publish Date - Feb 26 , 2026 | 11:50 PM

ద్విచక్ర వాహనం అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయిన ఘటనలో ఓ యువకు డు మృతిచెందాడు.

గెడ్డలోకి దూసుకుపోయిన ద్విచక్రవాహనం

  • యువకుడి మృతి

లక్కవరపుకోట, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం అదుపు తప్పి గెడ్డలోకి దూసుకుపోయిన ఘటనలో ఓ యువకు డు మృతిచెందాడు. ఈ ఘటనపై హెచ్‌సీ పాపారావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం గుడివాడ గ్రామానికి చెందిన గుడివాడ కిశోర్‌(19) గురువారం తన ద్విచక్రవాహనంపై ఎల్‌.కోట వైపు నుంచి తాతగారి ఊరు కొట్యాడ వెళ్తున్నాడు. ఎల్‌.కోట-ఖాసాపేట మధ్య ఉన్న వంతెనపైకి వచ్చేసరికి.. ద్విచక్ర వాహనం అదుపు తప్పి, గెడ్డలోకి దూసుకుపోయింది. దీంతో కిశోర్‌ నీటిలో మునిగి, మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. మృతుని తల్లిదండ్రులు వెంకటరావు, మంగమ్మలకు సమాచారం ఇచ్చారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 26 , 2026 | 11:50 PM