బస్సు ఢీకొని వ్యక్తి మృతి
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:12 AM
మండల కేంద్రంలోని బొబ్బిలి రోడ్డు కు వెళ్లే రహదారిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడని ఎస్‌ఐ వెల మల ప్రసాదరావు తెలిపారు.
రామభద్రపురం, జనవరి7 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని బొబ్బిలి రోడ్డు కు వెళ్లే రహదారిలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడని ఎస్‌ఐ వెల మల ప్రసాదరావు తెలిపారు. మండలంలోని కొట్టక్కి ఎరుకులపాకలు గ్రామానికి చెందిన పాలవలస సత్యనారాయణ(60) కూలి పని నిమిత్తం మంగళవారం రామభద్రపురం వచ్చి ఇంటికి వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. వెంటనే 108 వాహనంలో సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందు తూ ఆయన బుధవారం తెల్లవారు జామున మృతిచెందారు. మృతుడి అన్న కొడుకు రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేశారు.