పంట పొలాల్లో ఏనుగుల గుంపు
ABN , Publish Date - Jul 16 , 2026 | 12:25 AM
మండలంలోని బూర్జ, సుమిత్రపురం, చెల్లంనాయుడువలస, గాదెలవలస గ్రామాల పరిసర ప్రాంతాల్లో మూడు రోజులుగా ఎని మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది.
సీతానగరం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బూర్జ, సుమిత్రపురం, చెల్లంనాయుడువలస, గాదెలవలస గ్రామాల పరిసర ప్రాంతాల్లో మూడు రోజులుగా ఎని మిది ఏనుగుల గుంపు సంచరిస్తోంది. బుధవారం గాదెలవలసలోని పంట పొలాల్లో తిష్ఠవేశాయి. ఇక్కడి నారు ముడుల్లోకి ప్రవేశించి పంటలను తొక్కేశామని రైతులు వాపోయారు.కాగా ఏనుగుల కదలికలను నిరంతరం గమ నిస్తున్నామని అటవీశాఖఅధికారి మణికంఠేష్ తెలిపారు. ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అధికారులు పరిస్థితిని ఎప్పకటిప్పుడు పర్యవేక్షిస్తున్నారు.