ఎనిమిది ఏనుగుల గుంపు సంచారం
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:10 AM
మండలంలో ఐదు రోజులుగా వివిధ గ్రామాల్లో ఎనిమిది ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఫారెస్ట్ అధికారి ఆర్.కొండలరావు బక్కుపేట ప్రజలను అప్రమత్తం చేశారు.
సీతానగరం, జనవరి28 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఐదు రోజులుగా వివిధ గ్రామాల్లో ఎనిమిది ఏనుగుల గుంపు సంచరిస్తున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఫారెస్ట్ అధికారి ఆర్.కొండలరావు బక్కుపేట ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో ఏనుగులు తిరిగిన ప్రాంతంలో ఒంటరిగా ఎవరూ వెళ్లవద్దన్నారు. వాటిపై రాళ్లు విసరవద్దన్నారు. రబీ సీజన్‌లో రైతులు సాగు చేస్తున్న పంటలను ధ్వంసం చేయడం, కల్లాల్లో గడ్డి వాముల్లో భద్రపరచు కున్న ధాన్యం బస్తాలను తినేస్తున్నాయని, అలాగే మిగిలిన ధాన్యం బస్తాలను చిందరవందర చేస్తున్నాయని రైతులు డీఎఫ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు రేంజర్ రామనరేష్, మణికంఠేష్ ఉన్నారు.