పచ్చద నంతో ఆరోగ్యకర జీవనం
ABN , Publish Date - Aug 06 , 2026 | 11:19 PM
పచ్చద నంతో ఆరోగ్యకరమైన జీవనం లభి స్తుందని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి అన్నారు.
- ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి
- పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
- ఎస్పీ మాధవ్‌రెడ్డి
బెలగాం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పచ్చద నంతో ఆరోగ్యకరమైన జీవనం లభి స్తుందని ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌రెడ్డి అన్నారు. గురువా రం పార్వతీపురం మండలం అడ్డాపుశీల సమీ పంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. పచ్చదనం, పర్యావరణ పరిర క్షణ పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం మిషన్ హరితాంధ్ర అనే కార్య క్రమాన్ని ప్రారంభించిందన్నారు. దానిలో భాగంగా డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా ఉత్తర్వుల మేరకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రెండు లక్షల మొక్కలను నాటను న్నట్లు చెప్పారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యా లయం, అన్ని పోలీస్‌స్టేషన్లు, సర్కిల్ కార్యాల యాలు, పోలీస్ అధికారులు, సిబ్బంది నివాస గృహాల ప్రాంగణాల్లో సుమారు 22,500 మొక్కలను నాటుతున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే భవిష్యత్తు తరాలకు పరిశుభ్రమైన, స్వచ్ఛమైన పర్యావరనాన్ని అందించగలమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, సీఐ బి.వెంకటరావు, రూరల్ సీఐ రంగనాథం, సిబ్బంది పాల్గొన్నారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
విద్యార్థులకు చట్టాలపై సమగ్ర అవగాహన ఉండాలని ఎస్పీ మాధవరెడ్డి అన్నారు. చట్టాలు, పోలీసుల విఽధులు, బాధ్యతలపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన ప్రచార పోస్టర్‌ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సైబర్ నేరాలు, గంజాయి, మాదక ద్రవ్యాల నివారణ, రహదారి భ ద్రత, ట్రాఫిక్ నియమాలు, సమాజంలో జరుగుతున్న నేరాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను అంచనా వేయడానికి ఈ నెల 9న పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష నిర్వహించనున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు రమణమూర్తి, బి.వెంకటరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.