Share News

వేపాడలో వైభవంగా తీర్థమహోత్సవం

ABN , Publish Date - Jan 28 , 2026 | 11:47 PM

వేపాడలో పరదేశమ్మ, ముత్యాలమ్మతల్లి అమ్మవార్ల తీర్ధమహోత్సవం బుధవారం వైభవో పేతంగా జరిగింది.

   వేపాడలో వైభవంగా తీర్థమహోత్సవం
వేపాడలో పరుగు పోటీలో దౌవుడు తీస్తున్న ఎడ ్లబండి :

వేపాడ, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): వేపాడలో పరదేశమ్మ, ముత్యాలమ్మతల్లి అమ్మవార్ల తీర్ధమహోత్సవం బుధవారం వైభవో పేతంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్థులు అమ్మవార్లను ఉదయం ఐదు గంటల నుంచే దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనం తరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన ఎడ్ల బండ్ల పరుగు పోటీల్లో వేపాడ, వల్లంపూడి, వీలుపర్తి, దబ్బిరాజుపేట తదితర గ్రామాలకు చెందిన 16 ఎడ్ల బండ్లు పాల్గొనగా మొదటి ఆరుస్థానాల్లో నిలిచిన ఎడ్ల బండి యజ మానులకు నగదు బహుమతులను నిర్వాహకులు అందజేశారు. అలాగే వన వేపాడ-మన నేస్తం ట్రస్టు సభ్యుల ఆధ్వర్యంలో జూనియర్‌, సీని యర్‌ విభాగాల్లో నిర్వహించిన పురుషుల పరుగు పోటీలను 45 మంది పాల్గొన్నారు. ఈమేరకు ఈపోటీల్లో సీనియర్‌ విభాగంలో బక్కునా యుడుపేటకు చెందిన జి.చంద్రశేఖర్‌, మార్లాపల్లికి చెందిన ఎం.మహేష్‌ రెండు, వేపాడకు చెందిన ఎస్‌.జ్ఞానేష్‌ మూడోస్థానం సాధించారు. జూనియర్‌ విభాగంలో వీలుపర్తికి చెందిన కె.లోవరాజు,షన్ముఖి సాయి (గుడివాడ) జి.మధు(వల్లంపూడి) విజయం సాధించారు.

బల్లంకిలో మరిడిమాంబ...

మండలంలోని బల్లంకిలో మరిడిమాంబ జాతర బుధవారం ముగి సింది. ఈ సందర్భంగా గ్రామస్థులు ప్రదర్శించిన ఎడ్ల బండ్ల వేషాలు, మూడురోజులపాటు గ్రామపెద్దలు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్ర మాలు ఆకట్టుకున్నాయి. బుధవారం ఎడ్ల పరుగు పోటీలు ఉత్సాహ భరింతంగా సాగాయి. మూడు రోజుల తీర్ధమహోత్సవాన్ని పురస్కరిం చుకొని ఎటువంటి సంఘటనలు చొటుచేసుకోకుండా వల్లంపూడి ఎస్‌ఐ సుదర్శన్‌ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Jan 28 , 2026 | 11:47 PM