ఐదు రోజుల పని దినాలు అమలు చేయాలి
ABN , Publish Date - Sep 11 , 2026 | 11:54 PM
: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం నిరసన తెలిపారు.
- పీఎల్‌ఐ పంపిణీలో వ్యత్యాసాలు తొలగించాలి
- బ్యాంకు ఉద్యోగుల నిరసన
విజయనగరం రింగురోడ్డు, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కోట వద్ద నుంచి సాంస్కృత కళాశాల వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. యూఎఫ్‌బీయూ ప్రతినిధులు రమేష్, మురళీశ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్యాంకులకు వచ్చే ఆదాయాన్ని అనుసరించి ఉద్యోగులకు ఇచ్చే ప్రతిభ లింక్‌డ్ ఇన్‌సెంటీవ్ (పీఎల్‌ఐ) పంపిణీలో వ్యత్యాసాలు తొలగించాలన్నారు. క్లరికల్ నుంచి స్కేల్-3 అధికారులు వరకూ ఒకలాగ, స్కేల్-4 పై బడిన అధికారులకు మరొకలా కాకుండా అందరికీ సమానంగా ఇన్‌సెంటీవ్‌లు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే వారానికి ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాల విధానాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 28, 29 తేదీల్లో సమ్మె నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.