Share News

హోరాహోరీగా!

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:02 AM

A Fierce Neck-and-Neck Battle! డివిజన్‌ కేంద్రం పాలకొండ క్రీడాకారులతో సందడిగా మారింది. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 70వ స్టేట్‌ స్కూల్‌ గేమ్స్‌ కరాటే పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 800 మందిపైగా క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు.

హోరాహోరీగా!
అండర్‌-14 విభాగంలో పోటీ పడుతున్న బాలికలు

పాలకొండ, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): డివిజన్‌ కేంద్రం పాలకొండ క్రీడాకారులతో సందడిగా మారింది. శనివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 70వ స్టేట్‌ స్కూల్‌ గేమ్స్‌ కరాటే పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 13 ఉమ్మడి జిల్లాలకు చెందిన 800 మందిపైగా క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ ఆకట్టుకున్నారు. అంతకుముందు సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగనాఽ్నథ్‌, డీఈవో బ్రహ్మాజీరావు క్రీడా జ్యోతిని వెలిగించారు. అనంతరం అండర్‌-14, 17, 19 విభాగంలో బాల బాలికలకు జరిగిన ఈ పోటీలు ఆద్యంతం హోరాహోరీగా సాగాయి. క్రీడాకారులంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చూపారు. జిల్లాల వారీగా వయసు, బరువు కేటగిరీల్లో జరిగిన పోటీల్లో గెలుపొందిన అండర్‌-14 బాలికలకు డిప్యూటీ డీఈవో కృష్ణమూర్తి చేతుల మీదుగా మెడల్స్‌ అందించారు. స్టేట్‌ కరాటే అసోసి యేషన్‌ ఏపీ టెక్నికల్‌ డైరెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి.

షోకాజ్‌ నోటీసు జారీ చేస్తాం: సబ్‌ కలెక్టర్‌

రాష్ట్రస్థాయిలో జరిగిన కరాటే పోటీల్లో లోటుపాట్లు గమనించామని సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి నిర్వాహకులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామన్నారు. క్రీడలు ప్రారంభమైన అనంతరం సబ్‌ కలెక్టర్‌ తన కార్యాయానికి నిర్వాహకులను పిలిపించి లోటుపాట్లుపై ఆరా తీశారు. క్రీడాకారులకు కనీస వసతి, సక్రమంగా భోజనం కల్పించాలని ఆదేశించారు.

విజేతలు వీరే...

పట్టణంలోని ఓ ప్రైవేట్‌ విద్యా సంస్థల ప్రాంగణంలో నిర్వహించిన అండర్‌-14 బాలికల క్రీడా పోటీల్లో మైనస్‌ 18 కేజీల (బరువు) విభాగంలో కర్నూలు జిల్లాకు చెందిన కె.కావ్యశ్రీ బంగారు పతకం సాధించగా, చిత్తూరుకు చెందిన జి.మోక్షిత సిల్వర్‌ మెడల్‌ సాధించింది. విజయనగరానికి చెందిన సీహెచ్‌.హైమా వతి బ్రాంజ్‌ మెడల్‌ దక్కించుకుంది. మైనస్‌-22 కేజీల విభాగంలో విజయనగరానికి చెందిన డోలశ్రీ స్వర్ణ పతకం, వెస్ట్‌ గోదావరికి చెందిన జి.ద్వారక సిల్వర్‌, గుంటూరు జిల్లాకు చెందిన నోషిత, కడప జిల్లాకు చెందిన దీక్షిత బ్రాంజ్‌ మెడల్స్‌ సాధిం చారు. మైనస్‌ -24 కేజీల విభాగంలో కె.షెట్టి బంగారు పతకం , విశాఖ వాసి పూజిత సిల్వర్‌, కర్నూలు, గుంటూరుకు చెందిన సీహెచ్‌.లావణ్య, ఎం.సింఽధూ బ్రాంజ్‌ మెడల్స్‌ దక్కించుకున్నారు. మైనస్‌-26 కేజీల విభాగంలో కర్నూలుకు చెందిన రక్షిత, విశాఖ వాసి త్రిషిక, చిత్తూరుకు చెందిన శశికలలు విజేతలుగా నిలిచారు. మైనస్‌-30 కేజీల విభాగంలో కృష్ణా జిల్లాకు చెందిన అఫ్రీనా, ఈస్ట్‌ గోదావరి జిల్లా వాసి హనుజ, చిత్తూరుకు చెందిన ప్రియా, కర్నూలుకు చెందిన రవిత విజయం సాధించారు. మైనస్‌-34 కేజీల విభాగంలో కడపకు చెందిన దీపిక, చిత్తూరు వాసి ప్రణీత, విశాఖకు చెందిన సాన్వీ, పూజా గెలుపొందారు. ఈ కార్యక్ర మంలో జిల్లా ప్రెసిడెంట్‌ రామకృష్ణ, డివిజనల్‌ స్పోర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ వెంకటరమణ, ఎస్‌.వెంకటరమణ, పీడీలు , కోచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2026 | 12:02 AM