Share News

A festival with women మహిళలతోనే పండగ

ABN , Publish Date - Mar 09 , 2026 | 12:23 AM

A festival with women ఏ ఇంట అయినా మహిళలతోనే పండగ ముడిపడి ఉంటుందని, వారు కుటుంబానికి ఎంతో కీలకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

A festival with women మహిళలతోనే పండగ

మహిళలతోనే పండగ

వారు దేవుడు వచ్చిన వరం

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

విజయనగరం, మార్చి 8 (ఆంధ్రజ్యోతి):

ఏ ఇంట అయినా మహిళలతోనే పండగ ముడిపడి ఉంటుందని, వారు కుటుంబానికి ఎంతో కీలకమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్‌ గ్రౌండ్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను రెండేళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నానని, మహిళలతో నిరంతరంగా మాట్లాడే అవకాశం లభించిందన్నారు. తన జీవితంలో అక్క, తల్లి, భార్య, కుమార్తె ఉన్నారని, మహిళలు కుటుంబానికి ఎంతో ముఖ్యమని చెప్పారు. వారు లేకుండా ఏ పండుగ పూర్తికాదని, అలాంటి మహిళలను ఇచ్చిన భగవంతుడిని ఎన్నటికీ మరువలేమన్నారు. అలాగే దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా స్వయం సహాయక సంఘాలు మన రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నాయని, సభ్యుల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో సుమారు 90 లక్షల మంది మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారని, గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. మహిళల విద్యాభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో స్త్రీ శక్తి పథకం ముఖ్యమైనదన్నారు. ఎమ్మెల్యే అదితిగజపతిరాజు మాట్లాడుతూ, మహిళల అభివృద్ధి, రక్షణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి మాట్లాడుతూ, తన తల్లి కుటుంబాన్ని చూసుకుంటూ వ్యవసాయం చేస్తూ ఎంతో సమర్థమైన పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పాలవలస యశస్వి, మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌ బంగార్రాజు, జేసీ సేతు మాధవన్‌, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాస్‌పణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

--------------------------

Updated Date - Mar 09 , 2026 | 12:23 AM