Share News

కన్నుల పండుగగా..

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:18 PM

చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి దేవస్థానంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం గురువారం సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది.

కన్నుల పండుగగా..
వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు

- తోటపల్లి వేంకటేశ్వరుని కల్యాణం

- అధిక సంఖ్యలో తిలకించిన భక్తులు

గరుగుబిల్లి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): చినతిరుపతిగా ప్రసిద్ధిగాంచిన తోటపల్లి దేవస్థానంలో వేంకటేశ్వరస్వామి కల్యాణం గురువారం సాయంత్రం కన్నుల పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. కల్యాణంలో భాగంగా ఉదయం సుప్రభాత సేవ, నిత్యారాధన, మంగళా శాసనములు, ఎదురు సన్నాహోత్సవం, కోలాటం, గరుడ వాహనంపై స్వామివారి తిరువీధి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు పాణిగ్రహణ మహోత్సవాన్ని అర్చకులు జేబీ హరికృష్ణమాచార్యులు, ఆర్‌.పార్ధసారధిచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు వీవీ అప్పలాచార్యులు, వీవీ శశిధర్‌ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. స్వామివారి కల్యాణానికి అవసరమైన పట్టు వస్త్రాలు, పూజా సామగ్రిని దేవస్థానం ఈవో బి.శ్రీనివాస్‌, చైర్మన్‌ ఎం.ఫకీరునాయుడు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ కల్యాణం జరిపించారు. ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, సన్యాసినాయుడు, ఎంపీపీ ఉరిటి రామారావు, రాష్ట్ర డైరెక్టర్లు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, అంబటి రాంబాబు, అక్కేన మధుసూదనరావు, ఏఎంసీ చైర్మన్‌ కె.కళావతి, వెంపటాపు భారతి, ఎంపీటీసీ సభ్యులు ఎం.సింహాచలంనాయుడుతో పాటు ధర్మకర్తల మండలి సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్‌తో పాటు దేవస్థానాల అభివృద్ధి ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీ డి.పారినాయుడు, సిబ్బంది జి.శ్రీధర్‌నాయుడు తదితరులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Updated Date - Jan 29 , 2026 | 11:18 PM