చక్కెర కర్మాగారాలపై తక్షణమే నిర్ణయం తీసుకోవాలి
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:11 AM
రాష్ట్ర ప్రభుత్వం మూతపడిన చక్కెర కర్మాగారా లపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు.
విజయనగరం దాసన్నపేట/ జామి, జూలై 5(ఆంధ్ర జ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మూతపడిన చక్కెర కర్మాగారా లపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ కోరారు. ఈమేరకు ఆయ న కార్మిక నాయకులతో కలిసి మంత్రి కొండపల్లి శ్రీని వాస్‌కు ఆదివారం వినతిపత్రం అందించారు. ఈసంద ర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చక్కెర కర్మాగారాల రైతులకు, కార్మికు లకు, ఉద్యోగులకు తగిన న్యాయం జరుగుతుందని ఆశించామని.. నేటీకీ కార్మికులకు, ఉద్యోగులకు పీఎఫ్, గ్రాడ్యూటీ చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డా యన్నారు. కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు అర్హత ఉన్నవారికి భోగాపురం విమానాశ్రయంలో గానీ, జిల్లాకు వచ్చే నూతన పరిశ్రమల్లో గానీ ఉపాధి అవకా శాలు కల్పించాలని కోరారు. జామి మండలంలోని భీమసింగి సుగర్స్ కార్మికులను ఆదుకుని, వారికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలన్నా రు. మంత్రిని కలిసిన వారిలో కార్మిక నాయకులు శ్రీను, పకీర్, ఆదిబాబు, అప్పలనాయుడు, వెంకటరావు, రాం బాబు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.