చెత్తలో మృత శిశువు
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:52 PM
ఎంకే వలస గ్రామంలోని సచివాలయం వెనుక భాగంలో ఉన్న చెత్తలో ఎవరో మృతశిశువును పడవేశారు.
జామి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ఎంకే వలస గ్రామంలోని సచివాలయం వెనుక భాగంలో ఉన్న చెత్తలో ఎవరో మృతశిశువును పడవేశారు. మంగళవారం ఈ మృతశిశువును చూసిన స్థానిక మహిళ గ్రామంలోకి వెళ్లి చెప్పగా.. అంగన్ వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది వచ్చి పరిశీలించారు. వీరు ఎస్‌ఐ వీరజనార్ధన్, అలమండ పీహెచ్‌సీ వైద్యురాలు వినీతకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ అప్పలనాయుడు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ శిశువు నెలలు నిండకుండా పుట్టినట్టు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై ఎస్‌ఐ కేసు నమోదుచేశారు. ఈ విషయంపై చుట్టు పక్కల గ్రామాల్లో విచారణ చేయాలని ఐసీడీఎస్ పీవో అచ్యుత తమ సిబ్బందిని ఆదేశించారు.