Share News

A Day in Advance ఒక రోజు ముందే..

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:18 AM

A Day in Advance జిల్లాలో ఒక రోజు ముందే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 1న ఆదివారం సెలవు కావడంతో శనివారం 15 మండలాలు, రెండు మూడు మునిసి పాలిటీలు, ఒక నగరపంచాయతీలో లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందించనున్నారు.

A Day in Advance  ఒక రోజు ముందే..

గరుగుబిల్లి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక రోజు ముందే ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 1న ఆదివారం సెలవు కావడంతో శనివారం 15 మండలాలు, రెండు మూడు మునిసి పాలిటీలు, ఒక నగరపంచాయతీలో లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందించనున్నారు. మొత్తంగా 1,38,296 మంది పింఛన్‌దారులకు రూ.59.11 కోట్లు విడుదల చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ ఎం.సుధారాణి శుక్రవారం తెలిపారు. నిబంధనల మేరకు శనివారం సచివాలయ ఉద్యోగులు నేరుగా పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి పింఛన్‌ నగదు అందిస్తారని చెప్పారు. ఈ మేరకు వారికి ఆదేశాలు జారీ చేశామన్నారు. నేడు అందుబాటులో లేని లబ్ధిదారులకు సోమవారం పింఛన్లు అందించనున్నట్లు వెల్లడించారు. పింఛన్‌దారుల్లో మృతులు ఉన్నట్లయితే ఆయా మొత్తాలను తిరిగి జమ చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆమె సిబ్బందిని హెచ్చరించారు.

Updated Date - Feb 28 , 2026 | 12:18 AM