Share News

A Day in Advance ఒక రోజు ముందే..

ABN , Publish Date - Jan 30 , 2026 | 11:32 PM

A Day in Advance జిల్లాలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి-1 ఆదివారం సెలవు కావడంతో ఈ నెల 31న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు.

A Day in Advance  ఒక రోజు ముందే..

గరుగుబిల్లి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి-1 ఆదివారం సెలవు కావడంతో ఈ నెల 31న ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్నారు. పంచా యతీలు, పట్టణాల్లో ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్ము అందించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.సుధారాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘15 మండలాలు, మూడు పట్టణాల పరిధిలో ఉన్న 1,38,831 మంది పింఛన్‌దారుల కోసం ప్రభుత్వం రూ. 59.29 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తాన్ని 312 సచివాలయాల ఖాతాల్లో జమ చేశాం. సంబంధిత సచివాలయాల కార్యదర్శులు, సిబ్బంది శనివారం ఉదయం 6 గంటల నుంచి నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తారు.’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 11:32 PM