A dark future with drugs మాదక ద్రవ్యాలతో భవిష్యత్ అంధకారం
ABN , Publish Date - Jan 04 , 2026 | 12:30 AM
A dark future with drugs యువత మాదక ద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఎస్పీ దామోదర్ అన్నారు. అభ్యుదయం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లా పోలీసు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 3 కిలోమీటర్ల వాక్‌ఽథాన్ నిర్వహించారు. ర్యాలీ బాలాజీ జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకూ నిర్వహించారు.
మాదక ద్రవ్యాలతో భవిష్యత్ అంధకారం
ఎస్పీ దామోదర్
విజయనగరం క్రైం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): యువత మాదక ద్రవ్యాలకు బానిసలైతే భవిష్యత్తు అంధకారం అవుతుందని ఎస్పీ దామోదర్ అన్నారు. అభ్యుదయం సైకిల్ యాత్రకు మద్దతుగా జిల్లా పోలీసు అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 3 కిలోమీటర్ల వాక్‌ఽథాన్ నిర్వహించారు. ర్యాలీ బాలాజీ జంక్షన్ నుంచి మూడు లాంతర్ల వరకూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలనే సంకల్పంతో ఐజీ గోపీనాథ్ జట్టి 5 జిల్లాలను కవర్ చేస్తూ అభ్యుదయం సైకిల్ యాత్రను నిర్వహించారన్నారు. ఆ బృహత్తర కార్యక్రమం ముగింపునకు చిహ్నంగా జిల్లాలో వీక్‌థాన్ నిర్వహించామన్నారు. చాలా మంది యువత తెలిసీతెలియని వయసులో డ్రగ్స్ వినియోగించి వాటికి బానిసలుగా మారుతూ జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. డ్రగ్స్ ప్రభావం వాటిని వినియోగించే వారి ఆరోగ్యంపైనే కాకుండా వారి కుటుంబ బంధాలు, అనుబంధాలపైనా చూపుతుందన్నారు. వృత్తి, చదువు, మానసిక స్థితిపైన ప్రభావం చూపుతుందన్నారు. మాదక ద్రవ్యాలు వినియోగించినా, విక్రయించినా, రవాణాకు పాల్పడినా చట్టాన్ని ఉల్లంఘించినట్లే అన్నారు. చట్టాలను ఉల్లంఘిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎస్పీ గోవిందరావు, సీఐలు ఏవీ లీలారావు, ఆర్‌వీఆర్‌కే చౌదరి, శ్రీనివాసరావు, సూరినాయుడు, లక్ష్మణరావు, నరసింహమూర్తి, ఆర్‌ఐ గోపాలనాయుడు, అధికారులు సిబ్బంది, యువత పాల్గొన్నారు.