నేర రహిత సమాజమే లక్ష్యం
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:11 PM
నేర రహిత సమాజమే లక్ష్యమని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. శ
- విజయనగరం ఎస్పీ దామోదర్
- గుర్లలో ‘యువ చైతన్యం’
గుర్ల, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): నేర రహిత సమాజమే లక్ష్యమని ఎస్పీ ఏఆర్.దామోదర్ అన్నారు. శనివారం గుర్లలోని ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో నిర్వహించిన యువ చైతన్యం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరూ మహిళలతో గౌరవంగా, డ్రగ్స్‌కు దూరంగా, రోడ్డుపై బాధ్యతగా, సైబర్ ప్రపంచంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. సమాజాభివృద్ధికి తోడ్ప డాలని, నేర రహిత సమాజ నిర్మాణానికి తనవంతు కృషి చేయాలని అన్నారు. పోలీసులకు, చట్టాలకు, ప్రజలకు యువత వారథిగా నిలవాలన్నారు. ‘విద్యార్థులు చదువుకొని మంచి భవిష్యత్తు కోసం పాటుపడాలి. మత్తు పదార్ధాలకు బానిసకారాదు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారు. వాటిని వినియోగించినా, విక్రయించినా, తరలించినా కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలు, బాలికలతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలి. లేనిపక్షంలో పోక్సో చట్టం, ఇతర చట్టాలపై కేసులు నమోదు చేస్తాం. సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలి. ఓటీపీలు, ఏటీఎం పిన్‌లను అపరిచిత వ్యక్తులకు చెప్పరాదు. డిజిటల్ అరెస్టుల పేరుతో ఎవరైనా ఫోన్ చేస్తే ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలి. హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపా లి. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లి దండ్రులపై కేసులు నమోదు చేస్తాం. ట్రాఫిక్ నిబంధ నలను పాటించి పోలీసులకు సహకరించాలి.’ అని అన్నా రు. అనంతరం యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో చీపురుపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి.శంకరరావు, ఎస్‌ఐ పి.నారాయయరావు, పోలీసు సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు.