Share News

చివరి రోజు పోటాపోటీగా..

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:23 AM

ప్రాదేశిక నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది.

చివరి రోజు పోటాపోటీగా..

- ప్రాదేశికాలకు నామినేషన్ల దాఖలు

- అనూహ్యంగా బరిలోకి దిగిన సిరిసహస్ర

- కొత్తవలస, తెర్లాం జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్‌

- నాలుగు చోట్ల బొత్స కుటుంబీకులు..

- మారుతున్న జిల్లా పరిషత్‌ రాజకీయాలు

విజయనగరం కంటోన్మెంట్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రాదేశిక నామినేషన్ల గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు, నాయకులు, అభిమానులతో జడ్పీ ప్రాంగణంలో సందడి నెలకొంది. అభ్యర్థితో పాటు ఇద్దరిని మాత్రమే జడ్పీ కార్యాలయం లోపలకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. శుక్రవారం మధ్యాహ్నం అనూహ్యంగా జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు కుమార్తె సిరి సహస్ర తెరపైకి వచ్చారు. ఆమె కొత్తవలస, తెర్లాం జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసి అందరిని అశ్చర్యపరిచారు. సిరిసహస్ర వెంట తండ్రి చిన్నశ్రీను, ఎస్‌.కోట, బొబ్బిలి ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, బేబీనాయన, మాజీ ఎమ్మెల్యే తెంటులక్ష్మునాయుడు ఉన్నారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా తన బంధుగణంతో నామినేషన్లు వేయించారు. ఆయన కుమార్తె అనూష (బొండపల్లి), కోడలు పూజిత (గరివిడి ), సొదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి(గుర్ల), తమ్ముడు కుమారుడు బొత్స చైతన్య (పూసపాటిరేగ) జడ్పీటీసీ స్థానాలకు వైసీపీ తరఫున నామినేషన్లు వేశారు. ఎమ్మెల్యే కళావెంకటరావు కోడలు కిమిడి సంధ్య (గరివిడి), మార్కెఫెడ్‌ చైర్మన్‌ కర్రోతు బంగార్రాజు కుమార్తె చంద్రకళ (భోగాపురం) జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. దిగ్గజ నేతల కుటుంబాలకు చెందిన మహిళా మణులు ప్రాదేశిక బరిలోకి దిగుతుండడంతో జిల్లా రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. జడ్పీ పీఠంపై ఆశలు పెంచుకున్న నేతలు చివరిరోజున అనూహ్యంగా నామినేషన్లు దాఖలు చేయడంతో జిల్లా పరిషత్‌ రాజకీయాలు మారనున్నాయి.

జడ్పీటీసీలకు 258.. ఎంపీటీసీలకు 2,577

నేడు నామినేషన్ల పరిశీలన

విజయనగరం, అక్టోబరు 23 (ఆంధ్ర జ్యోతి): జిల్లాలోని 27మండలా ల జడ్పీటీసీ స్థానాలకు ఆఖరి రోజు శుక్ర వారం 141 నామినేషన్లు దాఖలు అయ్యాయి. తొలిరోజు 20, రెండో రోజు 97 నామినేషన్లు వచ్చాయి. మొత్తంగా 258 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఎంపీటీసీ స్ధానాలకు 2,577 వచ్చాయి. వీటన్నింటినీ శనివారం అధికారులు పరిశీలించనున్నారు. ఇందుకు సంబం దించి ఏర్పాట్లు పూర్తి చేశారు. నామి నేషన్లు వేసిన అభ్యర్థులు విధిగా హాజరై తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలనలో నిరూపించుకోవల్సి ఉంది. అన్ని వివ రాలు సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. అనర్హులు అయితే కలెక్టర్‌కు అప్పీలు చేసుకోవల్సి ఉంటుంది.

Updated Date - Oct 24 , 2026 | 12:23 AM