Share News

దాడి ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

ABN , Publish Date - Sep 08 , 2026 | 12:30 AM

మండలంలోని రంగారాయపురం గ్రామం వద్ద నాగావళి నదిపై ఉన్న వంతెన దిగువన ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపారు.

 దాడి ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు

సంతకవిటి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): మండలంలోని రంగారాయపురం గ్రామం వద్ద నాగావళి నదిపై ఉన్న వంతెన దిగువన ఓ వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. వాసుదేవపట్నం గ్రామానికి చెందిన యెజ్జల భాస్కరరావు ఆదివారం సాయంత్రం నాగావళి నదిలో స్నానం చేస్తున్నా రు. అదే సమయంలో బాలకృష్ణ, ఎర్రంనాయుడు అనే ఇద్దరు బహిర్భూమికి వెళ్లి వచ్చి, భాస్కరరావు స్నానం చేస్తున్న ప్రాంతానికి ఎగువ భాగంలో నదిలో కడుక్కుంటున్నారు. దీంతో భాస్కరరావు వారిని ప్రశ్నించారు. ఈక్రమంలో ఇద్దరూ భాస్కరరావుపై దౌర్జన్యానికి పాల్పడి రాడ్‌తో కొట్టేందుకు ప్రయత్నించారు. దాడిని అడ్డుకునే క్రమంలో రాడ్‌ తన ఎడమ చేతికి తగిలి గాయమైనట్లు భాస్కరరావు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు బాలకృష్ణ, ఎర్రంనాయుడుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 12:30 AM