Share News

లారీని ఢీకొన్న బస్సు.. పది మందికి గాయాలు

ABN , Publish Date - Jan 08 , 2026 | 12:17 AM

లారీని బస్సు ఢీకొన్న ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి.

లారీని ఢీకొన్న బస్సు.. పది మందికి గాయాలు

భోగాపురం, జనవరి 7(ఆంధ్రజ్యోతి): లారీని బస్సు ఢీకొన్న ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని నారుపేట సమీప జాతీ య రహదారిపై బుధవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సిమెంటు లోడుతో విశాఖ నుంచి ఒడిశా వైపు వెళ్తున్న లారీని నారుపేట సమీపంలో వెను క నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో లారీ వెనుక భాగం, బస్సు ముం దు భాగం నుజ్జయ్యింది. బస్సు డ్రైవర్‌తో పాటు బస్సులో ఉన్న మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో సుందరపేట సీహె చ్‌సీకి తరలించారు. చికిత్స అనంతరం అందరూ వారి గ్రామాలకు వెళ్లిపోయా రు. డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ తరలించారు. ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన లారీ డ్రైవర్‌ పాలకుర్తి నరిశింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ కె.దుర్గాప్రసాదురావు తెలిపారు.

Updated Date - Jan 08 , 2026 | 12:17 AM