Share News

A break for the second day as well రెండో రోజూ బ్రేక్‌

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:54 PM

A break for the second day as well విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక వరుసగా రెండో రోజూ వాయిదా పడింది. శుక్రవారం నిర్ణీత సమయానికి ఎంపీటీసీ సభ్యులెవరూ సమావేశానికి హాజరుకాకపోవడంతో ఎన్నికను శాశ్వతంగా వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్‌ అధికారి ఎం.రామారావు ప్రకటించారు.

A break for the second day as well రెండో రోజూ బ్రేక్‌
న్నికను శాశ్వతంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్న ప్రిసైడింగ్‌ అధికారి రామారావు

రెండో రోజూ బ్రేక్‌

భోగాపురం ఎంపీపీ ఎన్నిక మళ్లీ వాయిదా

సంఖ్యాబలం లేక కూటమిలో పీటముడి

హాజరుకాని ఎంపీటీసీ సభ్యులు

శాశ్వతంగా వాయిదా వేసిన ప్రిసైడింగ్‌ అధికారి

టీడీపీ, జనసేన మధ్య కొలిక్కిరాని పీఠం పంపకం

కీలకంగా మారిన నలుగురు స్వతంత్ర సభ్యులు

భోగాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): విజయనగరం జిల్లా భోగాపురం మండల పరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక వరుసగా రెండో రోజూ వాయిదా పడింది. శుక్రవారం నిర్ణీత సమయానికి ఎంపీటీసీ సభ్యులెవరూ సమావేశానికి హాజరుకాకపోవడంతో ఎన్నికను శాశ్వతంగా వాయిదా వేస్తున్నట్లు ప్రిసైడింగ్‌ అధికారి ఎం.రామారావు ప్రకటించారు. తదుపరి చర్యల కోసం జిల్లా ఎన్నికల అధికారి ద్వారా రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనున్నట్లు తెలిపారు. దీంతో ఎంపీపీ పీఠం ఎవరికి దక్కుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సిన ఎన్నికకు ఎంపీటీసీ సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడింది. శుక్రవారం కూడా నిర్ణీత సమయానికి సభ్యులు రాకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ఇచ్చారు. 12.10 గంటల్లోపు హాజరుకాకపోతే ఎన్నికను శాశ్వతంగా వాయిదా వేస్తామని పీవో ప్రకటించారు. వైసీపీకి చెందిన ఆరుగురు ఎంపీటీసీలు కార్యాలయానికి చేరుకున్నా సమావేశంలో పాల్గొనలేదు. గడువు ముగిసినా ఎవరూ హాజరు కాకపోవడంతో పీవో ఎన్నికను వాయిదా వేస్తూ నోటీసు బోర్డులో ప్రకటన ఉంచారు.

సంఖ్యాబలం లేక కూటమిలో విభేదాలు

భోగాపురం మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలున్నాయి. టీడీపీ, జనసేన చెరో మూడు స్థానాలు గెలుచుకోగా, వైసీపీ ఆరు, స్వతంత్రులు నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ ఎన్నికకు ఏ పార్టీకీ అవసరమైన సంఖ్యాబలం లేదు. దీంతో నలుగురు స్వతంత్రులు కీలకంగా మారారు. స్థానిక ఎమ్మెల్యే లోకం నాగమాధవి అభ్యర్థన మేరకు ఎంపీపీ పదవిని జనసేనకు కేటాయించాలని కూటమి నిర్ణయించినట్లు సమాచారం. అయితే జనసేన అభ్యర్థి గెలుపునకు అవసరమైన మద్దతు లేకపోవడంతో చిక్కులు ఎదురవుతున్నాయి. స్వతంత్రులు జనసేనకు మద్దతు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే మద్దతు ఇస్తామని వారు చెబుతున్నట్లు సమాచారం. టీడీపీ, జనసేన చెరో రెండున్నరేళ్లు ఎంపీపీ పదవిని పంచుకోవాలనే ప్రతిపాదనకు వచ్చినప్పటికీ, తొలుత ఎవరికి అవకాశం ఇవ్వాలన్న విషయంలోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. కూటమిలో నెలకొన్న విభేదాలే ఎన్నిక వాయిదాకు ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated Date - Nov 20 , 2026 | 11:54 PM